
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ..
కాగితపు బ్యాటరీలు.. పేరు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తు కాలంలో ఇవే స్మార్ట్ పరికరాలకు ఆధారంగా ఉండబోతున్నాయి. పేపర్ బ్యాటరీలో తిరిగి వినియోగించడానికి వీలుగా ఉండే సెల్యులోజ్ ఉపయోగిస్తారు. ఈ బ్యాటరీలు అత్యంత ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. వీటిని తిరిగి చార్జ్ చేసుకోవచ్చు. వీటి తయారీకి పెద్దగా ఖర్చు కాదు. పైగా ఫ్యాక్టరీగా తయారిలో సహజంగా కూలిపోయే పదార్థాలను ఉపయోగిస్తారు. ఒకవేళ ఆ బ్యాటరీల కాలం చెల్లిపోతే.. కొంతకాలంలోనే అవి భూమిలో బయో డీగ్రేడ్ అవుతాయి. ఇన్ని పర్యావరణ అనుకూల ఫీచర్లు ఉన్నాయి కాబట్టి.. కాగితపు బ్యాటరీకి ఇటీవల CES సస్టైనబులిటీ అవార్డు వచ్చింది. ఇక భవిష్యత్తు కాలంలో స్మార్ట్ పరికరాలలో ఉపయోగించడానికి పేపర్ బ్యాటరీలను తయారుచేస్తుంది ప్లింట్ సంస్థ. కాదు పోర్టబుల్ మొబైల్స్ మాదిరిగానే.. మడత పెట్టే బ్యాటరీలు కూడా తయారు చేసేందుకు ఈ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది..” స్మార్ట్ పరికరాల తయారీకి బ్యాటరీలు చాలా అవసరం. బ్యాటరీల తయారీలో లిథియం, కోబాల్ట్ విపరీతంగా వాడాలి. దీనివల్ల భూగర్భంపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు కాలుష్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇదంతా జరగకూడదు అనుకుంటే.. పేపర్ బ్యాటరీలు కచ్చితంగా అందుబాటులోకి రావాలి. అప్పుడే పర్యావరణం బాగుంటుంది. లేకపోతే వీటివల్ల కాలుష్యం చెప్పలేని స్థాయిలో పెరిగిపోతుందని” పర్యావరణవేత్తలు అంటున్నారు. వచ్చే కాలంలో పేపర్ బ్యాటరీలు మాత్రమే కాకుండా.. పర్యావరణహితమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్లింట్ సంస్థ చెబుతోంది.