
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆనలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆత్మకూరు మండలం ఎస్ఎస్ తండా వద్ద బోలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదహారు మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రికి తరించారు.శ్రైశైలం దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
శ్రీశైలానికి వెళ్లి వస్తుండగా…
బొలేరో వాహనంలో ఉన్నవారంతా కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే అతి వేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.