
రిఫ్రిజిరేటర్ 100% బాగున్నప్పుడు ప్రతి ఆరు గంటలకు ఒకసారి 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ కూలింగ్ అయిపోతుంది. దీంతో డీప్ ఫ్రిడ్జ్ లో పేరుకుపోయిన ఐస్ కరిగిపోతుంది. అయితే డీప్ ఫ్రిడ్జ్ లోని ఐస్ పేరుకు పోతుందంటే ఫ్రిజ్‌లో ఏదైనా సమస్య వచ్చినట్లే. ఈ సమస్య వేటి వల్ల వస్తుందంటే?
ప్రతి ఇంట్లో కిచెన్ రూమ్ లో ఉండే ఫ్రిడ్జ్ ను సాధారణ రోజుల్లో కంటే వేసవికాలంలో ఎక్కువగా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందులో చల్లటి వస్తువులను ఎక్కువగా నిలువ చేసుకుంటారు. వేసవికాలంలో ఉష్ణోగ్రతను తట్టుకునేందుకు ఇందులో నిల్వచేసిన వస్తువులను తీసుకోవడానికి ఫ్రిజ్ ను పదేపదే ఓపెన్ చేస్తూ ఉంటారు. అయితే పదేపదే ఓపెన్ చేసిన తర్వాత దాని డోర్ క్లోజ్ చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఫ్రిడ్జ్ డోర్ సరిగా క్లోజ్ చేయకపోవడంతో అనేక సమస్యలు వస్తాయి. వీటిలో డీ ఫ్రిడ్జ్ లో ఐస్ పేరుకుపోవడం ఒకటి. అందువల్ల ఫ్రిడ్జ్ డోర్ ను ఎప్పటికీ పూర్తిగా మూసివేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
రిఫ్రిజిరేటర్ డోర్ లోపలి భాగంలో చుట్టూ రబ్బర్ సీలింగ్ ఉంటుంది. ఇది పాడైపోయినప్పుడు ఫ్రిడ్జ్ డోర్ సరిగా మూసుకోదు. దీంతో లోపలికి బయటికాలి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రబ్బర్ పాడయినప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లోని ఐస్ ఎప్పటికీ గడ్డ కడుతూ అలాగే ఉండిపోతుంది. అందువల్ల ఫ్రిజ్ డోర్ చుట్టూ ఉన్న రబ్బర్ సీలింగ్ పాడైపోయిందా? లేదా అనేది చూస్తూ ఉండాలి. అలాగే ఫ్రిడ్జ్ డోర్ కు ఉన్న గాస్కెట్ నాణ్యతను పరీక్షిస్తూ ఉండాలి. దీని నాణ్యత కోల్పోతే డీప్ ఫ్రిజ్‌లో ఐస్ పేరుకు పోతుంది. అయితే డీప్ ఫ్రిజ్‌లో ఐస్ పేరుకు పోతే ఈ గ్యాస్ కేట్ ను పరిశీలించి దాన్ని బాగు చేసుకోవాలి.
ఫ్రిడ్జ్ కూలింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. వాతావరణాన్ని బట్టి టెంపరేచర్‌ను సెట్ చేసుకోవాలి. ఎప్పుడూ ఒకే విధంగా టెంపరేచర్‌ను సెట్ చేసిన సమస్యలు వస్తాయి. ఉష్ణోగ్రతను బట్టి ఫ్రిడ్జ్ పనితీరు మారుతూ ఉంటుంది. అందువల్ల వాతావరణాన్ని బట్టి ఫ్రిడ్జ్ టెంపరేచర్‌ను ఏర్పాటు చేసుకోవాలి.