
చింత చిగురు వల్ల రక్తం పెరిగిపోతుంది. రక్తహీనతతో బాధపడేవారు దీనిని తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలను చింతచిగురును వివిధ రకాలుగా తీసుకునే ప్రయత్నం చేయాలి. దీంతో వారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
ఒకప్పుడు కామెర్ల వ్యాధికి సరైన మెడిసిన్ అందుబాటులో ఉండేది కాదు. దీంతో ఆకుపసరుతోనే వైద్యం చేసేవారు. అయితే చింత చిగురు తినడం వల్ల కామెర్ల వ్యాధిని రాకుండా అడ్డుకోవచ్చు. అయితే చింత చిగురులో అటిక బెల్లం ను కలిపి తినడం వల్ల ఈ వ్యాధి దరిచేరకుండా ఉంటుంది.
నీటి కలుషితం కారణంగా గొంతు నొప్పి వచ్చే అవకాశాలుంటాయి. ఈ కారణంగా ఒక్కోసారి మాట్లాడడం కూడా కష్టతరంగా మారుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని మెడిసిన్లు వాడినా నయం కాదు. అయితే చింత చిగురును తినడం వల్ల గొంతు సమస్యలను నివారించవచ్చు. గోరువెచ్చని నీటిలో చింతచిగురును వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. దీంతో గొంతు వాపు ఉన్నా.. ఆ సమస్య నుంచి బయటపడతారు.
ఇటీవల కాలంలో బయట తిండి తినడం వల్ల చాలామందికి అనవసరమైన కొవ్వు పేరుకు పోతుంది. అయితే ఈ కొవ్వును కరిగించడానికి ఎన్నో రకాల మెడిసిన్లు వాడుతూ ఉన్నారు. ఇలాంటివారు చింతచిగురును తినడం వల్ల అనవసరమైన కొవ్వును కరిగించుకోవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడంతో చెడుకోవు వచ్చే అవకాశం ఉండదు.
చింత చిగురుతో కూర వేసుకొని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏదైనా వ్యాధి సమయంలో కూడా దీనిని వైద్యుల సలహాతో తీసుకోవడం వల్ల ఎనర్జీ వస్తుంది. అందుబాటులో చింతచిగురు ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల నిత్యం ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
చింత చిగురుతో థైరాయిడ్ సమస్య కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. నేటి కాలంలో ఆడవారితో పాటు మగవారికి థైరాయిడ్ సమస్య పెరిగిపోతుంది. దీంతో రెగ్యులర్గా మెడిసిన్ వాడాల్సి వస్తుంది. అయితే చింత చిగురు తో ఆహార పదార్థాలను తినడం వల్ల థైరాయిడ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
ఇలాంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల చింతచిగురుకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం సరైన వర్షాలు లేక చింత చిగురు మార్కెట్లోకి తక్కువగా వచ్చిందని అంటున్నారు. దీంతో ధర పెరిగిందని చెబుతున్నారు.