
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ భవన్ లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కులగణన చేస్తామని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెప్పడంతో దీంతో అత్యవసరంగా సీడబ్ల్యూసీ సమావేశాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.
కులగణనపై…
ఇప్పటికే తెలంగాణలో కులగణన చేసినందున అందులో లోటుపాట్లను, ప్రయోజనాలను వివరించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కేవలం కులగణన అంశంపై మాట్లాడేందుకు, చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.