
వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియా ప్రొఫైల్‌ను పరిశీలిస్తే.. తనకు స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమని స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేకించి మిర్రర్ సెల్ఫీలు, వాటిని తను తరచుగా షేర్ చేస్తూ ఉంటాడు. అతని చాలా ఫోటోలలో iPhone 16 Pro Max మాత్రమే కనిపిస్తుంది. అంటే అతను ఈ ప్రీమియం డివైస్‌కు పెద్ద అభిమాని అని అర్థం చేసుకోవచ్చు. iPhone 16 Pro Max అడ్వాన్స్డ్ కెమెరా ఫీచర్లు, అద్భుతమైన డిజైన్ కారణంగానే బహుశా ఈ ఫోన్ వైభవ్ ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పెరుగుతున్న ఫాలోవర్లు
వైభవ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా తనకు పెరుగుతున్న క్రేజ్‌కు నిదర్శనం. ఇటీవల ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అతను కొన్ని మిర్రర్ సెల్ఫీలను షేర్ చేయగానే, క్షణాల్లో అతని ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. @vaibhav_sooryavanshi09 పేరుతో ఉన్న అతని అఫీషియల్ హ్యాండిల్‌కు ప్రస్తుతం 1 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది.
ఫేస్‌బుక్‌లోనూ చురుకుగా వైభవ్
ఫేస్బుక్లో కూడా వైభవ్ ప్రెజెన్స్ తక్కువేమీ కాదు. అతని పర్సనల్ పేజీ ‘Vaibhav Suryavanshi’కి కూడా వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. వారు అతని అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మొత్తానికి, వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు.. ఒక సోషల్ మీడియా ఐకాన్‌గా కూడా ఎదిగాడు. అతని అభిమానులు అతన్ని మైదానంలో సిక్సర్లు కొడుతూ చూడాలని కోరుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మిర్రర్ సెల్ఫీలు తీసుకుంటూ చూడాలని కూడా కోరుకుంటున్నారు.
ఎవరీ వైభవ్ సూర్యవంశీ?
వైభవ్ సూర్యవంశీ ఒక యువ క్రికెటర్. చాలా చిన్న వయస్సులోనే తన టాలెంటుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ కేవలం 13 సంవత్సరాల వయస్సులోనే ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ వంటి టోర్నమెంట్లలో అతి పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు. 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేయడంతో, అతను ఐపీఎల్లో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అతని దూకుడు బ్యాటింగ్ శైలి, కాన్పిడెన్స్ అతనికి సోషల్ మీడియాలో కూడా మంచి పాపులారిటీ తెచ్చిపెట్టాయి.