
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రేపు సాయంత్రం అమరావతికి ప్రధాని మోదీ రానున్నారు. రాజధాని అమరావతి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రధాని మోదీ వస్తున్నారు. అమరావతి పునర్నిర్మారణ పనుల ప్రారంభం కోసం ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నేడు బెంగళూరుకు…
అయితే ప్రధాని మోదీ సభకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కూడా ఆహ్వానించారు. జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏకు ఆహ్వాన పత్రికను అందించారు. కానీ జగన్ నేటి సాయంత్రానికి బెంగళూరుకు బయలుదేరి వెళుతున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి ఎనిమిది గంటలకు బెంగళూరుకుచేరుకోనున్నారు. అంటే రేపటి ప్రధాని సభకు జగన్ దూరంగా ఉంటారని డిసైడ్ అయినట్లయింది.