
నేడు, రేపు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. నేడు, రేపు మహారాష్ట్ర, కేరళ, ఏపీలో మోదీ పర్యటిస్తున్నారు. రేపు ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ కేరళలోఅంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును జాతికి అంకితం చేయనున్నారు. బహిరంగ సభల్లో కూడా మాట్లాడనున్నారు.
రేపు ఆంధ్రప్రదేశ్ లో…
రేపు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అమరావతిలో రూ.58 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ప్రధాని మోదీ చేయనున్నారు. దీంతో పాటు వివిధ రోడ్డు, రైలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. మోదీ పర్యటనకు మూడు రాష్ట్రాల్లో భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. ఏపీలోనూ బహిరంగ సభలో మాట్లాడతారు.