
1. బజాజ్ చేతక్
భారతదేశంలో మంచి బ్రాండ్‌గా పేరుగాంచిన బజాజ్ అందిస్తున్న అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో చేతక్ ఒకటి. ఇది మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 155 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ టాప్ మోడల్లో లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
2. టీవీఎస్ ఐక్యూబ్
టీవీఎస్ ఐక్యూబ్ కేవలం కాలేజీకి వెళ్లి రావడానికి మాత్రమే కాదు. ఇదో అద్భుతమైన ఫ్యామిలీ స్కూటర్ కూడా. దీని ధర రూ.1.08 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభమయ్యే ఐక్యూబ్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌పై 75 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 75 కిలోమీటర్లు. ఐక్యూబ్ డ్రైవ్ చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది ఒక పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్.
3. హోండా క్యూసీ1
క్యూసీ1 అనేది హోండా కంపెనీ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.90,000 నుంచి ప్రారంభమవుతుంది. హోండా క్యూసీ1 స్పెసిఫికేషన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. హోండా క్యూసీ1లో 1.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. క్యూసీ1లో రెండు రైడ్ మోడ్లు ఉన్నాయి. బ్యాటరీ ప్యాక్ 0-80% వరకు ఛార్జ్ కావడానికి 4.3 గంటలు పడుతుంది.
4. ఓలా ఎస్1ఎక్స్ జెన్ 3
ఓలా ఎస్1ఎక్స్ జెన్ 3 ఈ జాబితాలో ఉన్న మరో సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని 2kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన బేస్ వెర్షన్ ధర రూ.73,999 ఎక్స్-షోరూమ్. ఈ స్కూటర్ 108 కిలోమీటర్ల (ఐడిసి) రేంజ్ ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 101 కిలోమీటర్లు. ఇది 3.4 సెకన్లలో గంటలకు 40కిమీ వేగాన్ని అందుకుంటుంది. బ్యాటరీ ప్యాక్‌ను 4 గంటల 50 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
5. ఏథర్ రిజ్తా
ఇది కంపెనీ మొట్టమొదటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఎస్, జెడ్ అనే రెండు మోడళ్లలో అందుబాటులో ఉంది. ఎస్‌లో 2.9kWh బ్యాటరీ ఉంది. ఇది 105 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. జెడ్ రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఒకటి 2.9kWh బ్యాటరీ, మరొకటి 3.7kWh పెద్ద బ్యాటరీ, ఇది 125 కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉంది. బ్యాటరీ ప్రామాణికంగా ఐదు సంవత్సరాలు/60,000 కిలోమీటర్ల వారంటీతో వస్తుంది.