
ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయిన పింఛన్ల పంపిణీని కొనసాగిస్తున్నారు. సచివాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది కలసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లను మంజూరు చేస్తున్నారు.
ప్రజాప్రతినిధులతో కలసి…
గత ప్రభుత్వం చూపిన బాటలోనే ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ముందుగానే పింఛను మొత్తాన్ని ఖజానా నుంచి డ్రా చేసి విడుదల చేసి వారి ఖాతాల్లో వేయడంతో పింఛను దారులకు సులువుగా అందించగలుగుతున్నారు. మే 1వ తేదీ కావడంతో నేడు కూడా ఏపీ అంతటా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. మొత్తం 64 లక్షల మంది వరకూ పింఛన్ల పంపిణీచేయడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది.