
కొత్త స్పై షాట్ల ద్వారా తెలిసిన విషయాల ప్రకారం.. ఈ ఎస్యూవీ బేస్ మోడల్లో ఇప్పటికీ వీల్ కవర్లతో కూడిన స్టీల్ రిమ్‌లు ఉంటాయి. అంతేకాకుండా, హెడ్లైట్లు ఎల్ఈడీకి బదులుగా హాలోజన్తో వస్తాయి. ప్రస్తుత వెన్యూ బేస్ వేరియంట్‌కు విరుద్ధంగా, రాబోయే మోడల్ బేస్ వేరియంట్లో ఫెండర్‌కు బదులుగా డోర్ మిర్రర్‌పై టర్న్ ఇండికేటర్లు ఉంటాయి. అయితే, డిజైన్ మునుపటిలానే ఉండవచ్చు. ఇందులో స్ప్లిట్ ఎల్ఈడీ డీఆర్ఎల్, హెడ్‌ల్యాంప్ సెటప్‌ను అందిస్తుంది. కానీ దీని డిజైన్ స్కైర్ షేపులో ఉంటుంది. ఇది హ్యుందాయ్ ఎక్స్టర్, అల్కాజార్ మోడళ్ల నుంచి ఇన్ స్పైర్ పొందినట్లు కనిపిస్తుంది.
కొత్త ఎస్యూవీ డిజైన్ ఎలా ఉండబోతోంది?
నెక్స్ట్-జెన్ హ్యుందాయ్ వెన్యూ టాప్ మోడల్లో కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, బ్లాక్ క్లాడింగ్, ప్రస్తుత డిజైన్‌కు భిన్నంగా మరింత యాంగ్యులర్ ఓఆర్‌విఎమ్‌లు ఉంటాయి. అయితే, ఈ మోడల్లో ఇప్పటికీ ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ ఉండవు. వెనుక వైపున కొత్త వెన్యూ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్‌లు, సిల్వర్-ఫినిష్డ్ బంపర్, బ్లాక్ షార్క్ ఫిన్ యాంటెన్నాతో వస్తుంది. ఇప్పటికే ఉన్న మోడల్లో ఉన్న రియర్ పార్కింగ్ సెన్సార్లు బహుశా అలాగే ఉంటాయి.
ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి?
స్పై షాట్లలో కేబిన్‌కు సంబంధించిన ఎక్కువ సమాచారం అందించలేదు. అయితే, నెక్స్ట్-జెన్ వెన్యూ బిన్లో అనేక మార్పులు ఉంటాయని అంటున్నారు. వీటిలో పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కొత్త హ్యుందాయ్ క్రెటాలో ఉన్నట్లుగా 10.25-ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉండవచ్చు. దీనితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్, లెవెల్ 1 ఏడీఏఎస్ కూడా అందుబాటులో ఉండవచ్చు.
కొత్త వెన్యూలో ప్రస్తుత పవర్‌ట్రెయిన్ ఎంపికలను కొనసాగించే అవకాశం ఉంది. వీటిలో 82 బిహెచ్పి, 114 ఎన్ఎమ్ టార్క్‌తో కూడిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 118 బిహెచ్పి, 172 ఎన్ఎమ్ టార్క్‌తో కూడిన 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 114 బిహెచ్పి, 250 ఎన్ఎమ్ టార్క్‌తో కూడిన 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటాయి. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్ వస్తాయి.