
సింహాచలంలో జరిగిన ప్రమాద మృతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ప్రభుత్వం మృతి చెందిన ఒక్కొక్కరి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూరూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. గాయపడిన వారికి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి దేవాదాయ శాఖ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని తెలిపింది.
ముగ్గురితో కమిటీ…
సింహాచలం దేవస్థానంలో ఈరోజు తెల్లవారు జామున జరిగిన ఘటనలో ఎనిమిది మంది మరణించారు. ఐదుగురికిపైగానే గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గోడ కూలిన ఘటనపై సమగ్ర నివేదికను అందచేయాలని ప్రభుత్వం కమిటీని కోరింది.