
నేడు కంకిపాడుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు రానున్నారు. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తనయుడు వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాడు, రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఒకేసారి కలవడం అనేది కంకిపాడు వేదికగా జరగనుంది.
ఇద్దరు ముఖ్యమంత్రులు…
ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ సుప్రీంకోర్టు సిజె సివి రమణ, మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, పురందేశ్వరి పాల్గొననున్నారు. ఇప్పటికే దేవినేని ఉమామహేశ్వరరావు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరు కానుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇరువురు ముఖ్యమంత్రులు రాజకీయపరమైన అంశాలు మాట్లాడుకోకపో్యినా.. ఇద్దరు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.