
భూదాన్ భూముల అక్రమ విక్రయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. నిన్న ఐదు చోట్ల సోదాలు నిర్వహించామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. నలభై ఐదు వింటేజ్ కార్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. చాలా మంది ప్రముఖులు, రియల్టర్లు భూదాన్ భూములను కొనుగోలు చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు.
విదేశీ కరెన్సీతో పాటు…
పెద్దయెత్తున విదేశీకరెన్సీతో ఇరవై ఐదు లక్షల నగదును స్వాధీనం చేసుకన్నామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. తమ రెవెన్యూ వారసత్వంగా భావించి కొందరు అక్రమంగా భూదాన్ భూములను విక్రయించారని తెలిపింది. ఈ ఆస్తులను స్వాధీనం చేసుకుని తర్వాత విచారణను కొనసాగిస్తున్నామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు.