రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభం కోసం ప్రధాని మోదీ పర్యటనపై ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారయింది. మే రెండవ తేదీన ప్రధాని మోదీ తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 2:50 నిమిషాలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతి చేరుకుంటారు. 3గ 25 నిమిషాలకు ప్రధాన వేదిక వద్దకు వస్తారు. మధ్యాహ్నం 3:30ర నుంచి 4గ:45 నిమిషాల వరకు రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 4గంట 45 నిమిషాలకు హెలికాప్టర్ లో విజయవాడ విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని మోదీ ఢిల్లీ చేరుకుంటారు.
