
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దుండగుడి కత్తి దాడి అనంతరం అతడు తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన కత్తిపోట్ల ఘటన సైఫ్ జీవితంలో ఈ కొత్త నిర్ణయానికి కారణమా? అంటూ ఇప్పుడు బాలీవుడ్ లో చర్చ మొదలైంది.
సైఫ్ ముంబై నివాసంలో జరిగిన దోపిడీ ఘటనలో అతడి వెన్నెముకకు తీవ్ర గాయం కాగా, ఆ భాగాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స జరిగింది. గాయం తీవ్రమైనదే అయినా సైఫ్ త్వరగా కోలుకోవడంలో వైద్యుల సహకారం ఎనలేనిది. ప్రస్తుతం అతడు నటించిన జ్యువెల్ ఆఫ్ థీఫ్ విడుదలకు సిద్ధమవుతుండగా, గల్ఫ్ దేశం అయిన ఖతార్ లో విలాసవంతమైన ఆస్తిని కొనుగోలు చేయడం హాట్ టాపిగ్గా మారింది. అతడు ఆకస్మికంగానే ఈ నిర్ణయం తీసుకున్నాడా? అంటూ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.
సైఫ్ అలీ ఖాన్ ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ఐలాండ్ లోని `ది రెసిడెన్సెస్`లోని ఒక అపార్ట్ మెంట్ కొనుగోలు చేసాడు. `ది పెర్ల్` అనేది ఏరియా పేరు. సంపన్నులు నివాసం ఉండే ఇలాంటి చోట సురక్షితమైనదని సైఫ్ భావిస్తున్నట్టు తెలిసింది. అతడి తీరిక సమయాల్లో పూర్తిగా తన కుటుంబంతో ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాయల్ పటౌడి ప్యాలెస్ లో నివశిస్తూనే, ముంబై బాంద్రాలోని ఖరీదైన అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసాడు. ఆ తర్వాత ఇది అతి పెద్ద కొనుగోలు.
తాజాగా మీడియా సమావేశంలో సైఫ్ విదేశాలలో ఒక ఇంటిని కొనుగోలు చేయడం వెనక కారణాలను రివీల్ చేసాడు. ఇప్పుడు కొన్న ఇల్లు మనకు చాలా దూరంలో లేదు. సులభంగా అక్కడికి వెళ్లి రావచ్చు. పైగా చాలా సురక్షితమైనది. అక్కడ ఉండటం చాలా బాగుంది! అని కూడా తెలిపాడు. ఖతార్‌లో ఒక ప్రాజెక్ట్ షూటింగ్ చేస్తున్నప్పుడు సైఫ్ మొదట ఈ ఇంటిని కొనుగోలు చేయాలని భావించాడట. దీనికి కారణం ఈ ఇల్లు సురక్షితమే కాదు చాలా విశాలంగా, ప్రశాంతంగాను ఉంటుందని చెప్పాడు.
సైఫ్ నటించిన తదుపరి చిత్రం `జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్` ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. కూకీ గులాటి -రాబీ గ్రెవాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్ప్లిక్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ ఆనంద్ -మమతా ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.