
Kamal Hassan-Trisha : ఈమధ్యకాలంలో కొంతమంది సీనియర్ హీరోలు వయస్సు రీత్యా పొరపాటున నోరు జారేస్తుండడం గమనార్హం. చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు ఈమధ్య కాలంలో ఎక్కువగా ఇలా నోరు జారీ సోషల్ మీడియా లో బాగా ట్రోల్ అయ్యారు. ఇప్పుడు కమల్ హాసన్ కూడా ఆ జాబితాలోకి చేరిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కమల్ హాసన్(Kamal Hassan) లేటెస్ట్ గా మణిరత్నం తో ‘తగ్ లైఫ్'(Thug Life) అనే చిత్రం మొదలు పెట్టి, షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసాడు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత కూడా. జూన్ నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రొమోషన్స్ ఇప్పటి నుండే మొదలు పెట్టాడు కమల్ హాసన్. రీసెంట్ గానే ఆయన లిరిక్స్ అందించిన పాటని విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో యంగ్ హీరో శింబు(Silambarasan TR), త్రిష(Trisha Krishnan) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అయితే మొదటి సాంగ్ లాంచ్ కోసం ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ లో కమల్ హాసన్ త్రిష పై వేసిన ఒక అడల్ట్ జోక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమైన వివాదాలకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే ఒక విలేఖరి త్రిషకు ఇష్టమైన ఫుడ్ ఏమిటి అని అడుగుతారు. దానికి త్రిష సమాధానం చెప్తూ ‘ఉడకబెట్టిన అరటిపండు’ అని సమాధానం చెప్తుంది. దానిని తమిళ భాషలో ఎదో అంటారు , సమయానికి నోరు తిరగడం లేదని అంటుంది త్రిష. అప్పుడు కమల్ హాసన్ మైక్ అందుకొని ‘పేరేంటో తెలియదు కానీ, త్రిషకు నోట్లో పెట్టుకోవడం మాత్రం బాగా ఇష్టం’ అని అంటాడు. ఆ తర్వాత నవ్వుతూ ఆమెపై తొడపై చరుస్తాడు. దీనిపై నెటిజెన్స్ మాట్లాడుతూ కూతురు వయస్సు ఉన్న అమ్మాయి గురించి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా?, చాలా తప్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దీనికి కమల్ హాసన్ ఫ్యాన్స్ సమాధానం చెప్తూ ‘అక్కడ కమల్ ఏమి అన్నాడని మీరంతా ఇంత ట్రోల్ చేస్తున్నారు. ఆయన మామూలుగానే సమాధానం చెప్పాడు . కానీ మీ బుర్ర మొత్తం బూతులతో నిండిపోయి ఆలోచిస్తుంది కాబట్టి, మీకు అలాగే అర్థం అవుతుంది’ అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరికి అది అడల్ట్ జోక్ లాగానే అనిపించింది. కమల్ హాసన్ కేవలం సినిమాల్లోనే కాదు, రాజకీయ పరంగా కూడా ప్రముఖుడు. త్వరలోనే ఆయన రాజ్య సభలోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు. కాబట్టి ఆయన ఒక మాట అనే ముందు కాస్త జాగ్రత్త వహించాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.