
Akshaya Tritiya : హిందూ శాస్త్ర ప్రకారం ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే కొన్ని పర్వదినంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల జీవితం ఆనందమయంగా మారుతుంది. వీటిలో అక్షయ తృతీయ ఒకటి. అక్షయ తృతీయ అనగానే చాలామంది బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. కానీ ఏ రోజు శ్రీమహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి కి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. వీరికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ దేవతల అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేయడం వల్ల జీవితంలో ఉన్న కొన్ని దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా తమ జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించే అవకాశం ఉంటుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం వల్ల సాక్షాత్తు లక్ష్మీ దేవతను ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుందని అంటారు. కానీ ఇదే రోజు బంగారంతో పాటు మరికొన్ని వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అలా చేయడంవల్ల అదృష్టం వరుస్తుందని అంటున్నారు. అదేంటంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు అక్షయ తృతీయ ప్రారంభమై ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 2.12 గంటల వరకు ఉంటుంది. అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయాలని అనుకునేవారు ఈ కాలంలో చేయవచ్చు అని పండితులు తెలుపుతున్నారు. అయితే ఇదే రోజు బంగారం కొనలేని వారు కొన్ని వస్తువులను కొనడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని అంటున్నారు. ఆ వస్తువులు ఏంటంటే?
అక్షయ తృతీయ రోజు వచ్చి వస్తువులు అంటే పప్పులు ధాన్యాలు కొనుగోలు చేయాలి. అలాగే ఈరోజు బార్లీ లేదా పసుపు ఆవాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల శుభప్రదం అని అంటున్నారు. అలాగే అక్షయ తృతీయ రోజున గవ్వలు కొనడం కూడా చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. 11 గవ్వలను కొని వెరైటీ వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేస్తే కూడా ఇంట్లో సంపద ఇప్పుడు నిల్వ ఉంటుందని అంటున్నారు.
అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు రాతి ఉప్పు కొనుగోలు చేయాలని అంటున్నారు. అయితే ఈరోజు కొనుగోలు చేసిన రాతి ఉప్పును తినకూడదని గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతున్నాయి అంటున్నారు. అలాగే ఈరోజు రాగి ఇత్తడి పాత్రను కొనుగోలు చేయడం వల్ల కూడా లాభం జరుగుతుందని అంటున్నారు. ఈ లోహాలు లక్ష్మీదేవికి ప్రతిరూపాలుగా భావిస్తారు. అందుకే బంగారం కొనలేని వారు ఈ లోహాలను కూడా కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే విద్యాదేవిగా కురుస్తున్న సరస్వతి మాత అనుగ్రహం కోసం ఈరోజు పుస్తకాలు కొనుగోలు చేయాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల సౌభాగ్యం వస్తుందని అంటున్నారు.
అక్షయ తృతీయ రోజు కొత్త దుస్తులను ధరించాలని చెబుతున్నారు. ఈరోజు కొత్త దుస్తులు ధరించడం వల్ల శుభప్రదంగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈరోజు మట్టికుండను కొనుగోలు చేయడం ద్వారా శ్రేష్టంగా భావిస్తారు. అలాగే ఈరోజు పత్తిని కూడా కొనుగోలు చేయాలని అంటున్నారు. అతని కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా లాభపడతారని చెబుతున్నారు.