
NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలకి మంచి గుర్తింపైతే ఉంది. హీరోలందరూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరి లోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు వరుసగా ఏడు విజయాలను సాధించి స్టార్ హీరోలెవ్వరికి దక్కని ఒక అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు చేస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాతో మరోసారి సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి అంటూ ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈరోజు నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా సెట్ లో పాల్గొనబోతున్నాడు. అయితే మొదటి షాట్ తోనే ఎన్టీఆర్ నని తాను ఎలా ప్రూవ్ చేసుకుంటాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ చాలా అలర్ట్ గా ఉండడమే కాకుండా ఈ సినిమా మీద తన పూర్తి ఫోకస్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మొదటి షాట్ లోనే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక వ్యక్తి మీద పంచ్ కొట్టించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు సలార్ (Salaar) సినిమా విషయంలో కూడా ప్రశాంత్ నీల్ ఇలానే చేశారట. ప్రభాస్ మొదటి షాట్ ఒకరిని పంచుకొట్టేది తీశారట.
ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కూడా అలాగే తన మొదటి షాట్ చేసి ఆ తర్వాత సినిమా షూట్ లోకి ఎంటర్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి సెంటిమెంట్ గా మారిందా లేదంటే ప్రశాంత్ నీల్ కావాలనే ఇలా హీరోతో ముందుగా ఒక యాక్షన్ బ్లాక్ ని సెట్ చేసి ఆ తర్వాత తన సినిమాలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది.
మరి ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కి కూడా చాలా మంచి గుర్తింపైతే ఉంది. మరి అలాంటి నటుడితో సినిమా చేస్తున్నప్పుడు ప్రశాంత్ నీల్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చేస్తే బాగుంటుంది అని కొంతమంది సినిమా మేధావులు సైతం హెచ్చరిస్తున్నారు.
మరి వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది. తద్వారా వీళ్లకు ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసే పెడుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.