
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలకంగా ఉన్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్లులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో హైదాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.
రేపు సిట్ విచారణకు…
రేపు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి హాజరు అవుతానని సిట్ అధికారులకు సమాచారంం ఇచ్చార. ఆంధ్రప్రదేశ్ లోని మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన రాజ్ కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్ కసిరెడ్డి వేసిన పిటీషన్ ను విచారణ చేసిన ఏపీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో ఆయన సిట్ విచారణకు హాజరు అవ్వాలని రాజ్ కసిరెడ్డినిర్ణయించుకున్నారు. అందుకే ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు.