
Sobhita Dhulipala: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరు శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala). ఈమె తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే, కానీ హిందీ లో మాత్రం అనేక సినిమాల్లో నటించింది, వెబ్ సిరీస్ లు కూడా చేసింది. కొన్ని అడల్ట్ రేటెడ్ కంటెంట్ సినిమాల్లో కూడా ఈమె నటించింది. అక్కినేని నాగ చైతన్య తో పెళ్లి తర్వాత సినిమాలు పూర్తిగా మానేస్తుందని అంతా అనుకున్నారు కానీ, ఈమె లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు మాత్రం సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతోంది. అందాలను ఆరబోస్తూ ఫోటోలు దిగడమే కాకుండా, నోట్లో స్టైల్ గా సిగరెట్ పెట్టుకొని ఫోటో దిగడం పై అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని వంటి మహోన్నత కుటుంబానికి చెందిన కోడలు ఇలాంటి ఫోటోషూట్ లో పాల్గొనడం కరెక్ట్ కాదని అంటున్నారు.
ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే ఈ ఫోటోలకు అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) లైక్ కొట్టడమే. అప్పట్లో సమంత(Samantha Ruth Prabhu) కి విడాకులు ఇవ్వడానికి కారణం ఆమె ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ చిత్రం లో హద్దులు దాటి రొమాన్స్ చేయడం వల్లే అని ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. తన భార్య ని అలా చూడడం ఇష్టం లేనోడు, ఇలా చూడడానికి ఇష్టపడుతాడా?, అంటే అప్పట్లో వచ్చిన ఆ వార్త కేవలం పుకారు అన్నమాట. అక్కినేని నాగచైతన్య తన భార్యకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇస్తాడని ఈ ఒక్క సందర్భాన్ని చూసి చెప్పొచ్చు. శోభిత ఈరోజు అప్లోడ్ చేసిన ఫోటోలను చూసిన తర్వాత ఇంతకు ముందు తానూ ఎలా అయితే స్వేచ్ఛగా సినిమాలు చేస్తూ ఉండేదో, ఇక నుండి కూడా అలాగే ఉండబోతుంది అనే సంకేతాలు అభిమానులకు వెళ్లాయి. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
ఇక పోతే నాగ చైతన్య ‘తండేల్’ కి ముందు ఎలాంటి డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకున్నాడో మనమంతా చూసాము. ‘తండేల్ ‘ చిత్రం శోభిత తో పెళ్లి తర్వాత విడుదలైంది. ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రతికించి చెప్పనవసరం లేదు. అక్కినేని కుటుంబానికి మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ సినిమాగా నిల్చింది ఈ చిత్రం. ఇదంతా శోభిత ధూళిపాళ్ల అక్కినేని కుటుంబం లో కోడలిగా అడుగుపెట్టడం వల్లే జరిగింది అంటూ అభిమానులు గొప్పగా అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రస్తుతం నాగ చైతన్య ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ తో ఒక హారర్ జానర్ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదల కానుంది. ఆర్కా మీడియా బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుంది.