
Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)..సోషల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు గత కొంతకాలంగా మారుమోగిపోతున్న పేరు ఇది. మాజీ సీఎం జగన్ కి ముఖ్య అనుచరుడిగా పిలవబడే రాజ్ కసిరెడ్డి కాసేపటి క్రితమే అరెస్ట్ అయ్యాడు. మద్యం కుంభకోణం మొత్తానికి సూత్రదారి, పాత్రధారి రాజ్ కసి రెడ్డి అంటూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవలే మీడియా ముందుకొచ్చి చెప్పడం తో, సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి ని విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. కానీ ఆయన మాత్రం రాలేదు. దుబాయి నుండి తిరిగి వస్తూ రేపు విచారణకు హాజరు అవుతానని చెప్పాడు రాజ్ కసి రెడ్డి. అయినప్పటికీ నమ్మకం చూపని సిట్ అధికారులు, ఆయన హైదరాబాద్ లో విమానాశ్రయం లోకి అడుగుపెట్టగానే అరెస్ట్ చేసి తమతో పాటు తీసుకెళ్లారు. మరి రేపు విచారణ లో ఆయన మద్యం కుంభకోణం పై ఎలాంటి నిజాలు భయటపెట్టబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.
రీసెంట్ గానే సిట్ అధికారులు విజయ్ సాయి రెడ్డి ని విచారించిన సంగతి తెలిసిందే. విజయ్ సాయి రెడ్డి మరోసారి రాజ్ కసి రెడ్డి చాలా తెలివైన క్రిమినల్, మొదట్లో నేను చాలా మంచోడిని అనుకునేవాడిని, అలా నమ్మి అతనికి పార్టీ ప్రేముకులందరికీ దగ్గర చేశారు, కానీ ఇంత దుర్మార్గుడు అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. రాజ్ కసి రెడ్డి కూడా విజయ్ సాయి రెడ్డి భాగోతం మొత్తం బయటపెడుతాను, దయచేసి మీడియా మిత్రులు కేవలం ఒకవైపు మాత్రమే విని నిజమని పొరబడకండి, దయచేసి నా వెర్షన్ కూడా వినండి, త్వరలోనే మీడియా ముందుకు వస్తా అంటూ ఒక ఆడియో రికార్డు ని మీడియా కి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే రాజ్ కసి రెడ్డి పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడని తెలిసింది.
‘కార్తికేయ 2’ వంటి భారీ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్ చేసిన చిత్రం ‘స్పై’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నిర్మాతగా వ్యవహరించిన రాజ్ కసి రెడ్డి తో నిఖిల్ కి గొడవలు అయ్యాయి. సినిమా ఔట్పుట్ ఆశించిన స్థాయిలో రాలేదని, కొన్ని మార్పులు చేర్పులు చేయడం కోసం కాస్త సమయం తీసుకోవాలని, అప్పుడే విడుదల చేయొద్దని చెప్పాడట. కానీ రాజ్ కసి రెడ్డి మాత్రం వినకుండా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించేశాడు. దీనికి అలిగిన నిఖిల్ ఆరంభం లో ప్రొమోషన్స్ లో పాల్గొనేవాడు కాదు. కానీ ఆ తర్వాత పంచాయితీ జరిగి ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజ్ కసి రెడ్డి, అలియాస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో మాట్లాడిన మాటలను మీరు కూడా వినండి.