
Buchi Babu: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కి అసిస్టెంట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన బుచ్చి బాబు(Buchi babu sana), ఉప్పెన చిత్రం తో డైరెక్టర్ గా మారి ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడో మనమంతా చూసాము. మొదటి సినిమాతోనే ఆయన కుర్ర డైరెక్టర్స్ కి సాధ్యం అవ్వని వసూళ్లను రాబట్టి శభాష్ అనిపించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే అంశంపై అందరిలో ఉత్కంఠ ఉండేది. కానీ ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) తో ‘పెద్ది'(Peddi Movie) సినిమా సెట్ చేసుకొని అందరినీ షాక్ కి గురి చేసాడు. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన ‘పెద్ది’ గ్లింప్స్ వీడియో కి ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము.
ఇప్పటికీ సోషల్ మీడియా లో ఈ గ్లింప్స్ వీడియో ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే సరికొత్త షెడ్యూల్ మొదలు అవ్వడానికి కాస్త గ్యాప్ ఉండడం తో, బుచ్చి బాబు తన తండ్రికి సంవత్సరీకాన్ని జరిపించడం కోసం పిఠాపురానికి బయలుదేరాడు. యూ కొత్తపల్లి మండలం లోని గ్రామస్తులందరికీ ఆయన ఈ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేసాడు. తన తండ్రిని తల్చుకుంటూ కన్నీటి పర్యంతం కూడా అయ్యాడు. గ్రామస్తులతో కలిసి ఆయన భోజనం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే బుచ్చి బాబు తండ్రి పేరు వెంకట్రావు. ఈయన గత ఏడాది జూన్ నెలలో మరణించాడు. ఈ సందర్భంగా సరిగ్గా సంవత్సరం అవ్వడం తో జరగాల్సిన కార్యక్రమాలను జరిపించాడు. చాలా కాలం తర్వాత సొంత ఊరికి బుచ్చి బాబు రావడంతో గ్రామం లో సందడి వాతావరణం కనిపించింది.
సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి. బుచ్చి బాబు తన ఉప్పెన చిత్రాన్ని చాలావరకు తన సొంత ఊరులోనే షూటింగ్ చేసాడు. పుట్టి పెరిగిన ఊరిలో మొదటి సినిమాకు షూటింగ్ చేసే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. బుచ్చి బాబు ‘పెద్ది’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని పాన్ ఇండియా రేంజ్ లో కొట్టగలిగితే ఆయన పేరు ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వచ్చే ఏడాది మార్చి 27 న ఈ సినిమా మన ముందుకు రాబోతుంది.