
Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఏది చేసిన చాలా స్పెషల్ గా ఉంటుంది. ప్రతీ విషయంలోనూ ఆయన ఇతరులకు భిన్నంగా అలోచించి, అదే విధంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకోసం ఎంత దాకా అయిన వెళ్తారు. అందుకు ఉదాహరణగా నిల్చింది రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన. వివరాల్లోకి వెళ్తే బాలయ్య బాబు లేటెస్ట్ గానే ఒక BMW కారుని కొనుగోలు చేసాడు. ఈ కారు నెంబర్ కోసం ఆయన వేలంపాటలో పాల్గొన్నాడు. ఆయనకు TG 09 0001 అనే ఫ్యాన్సీ నెంబర్ బాగా నచ్చింది. ఆయనకు లాగానే మిగిలిన వాళ్లకు కూడా ఫ్యాన్సీ నెంబర్ నచ్చింది. దీంతో వేలం పాటలో పాల్గొన్న బాలయ్య బాబు 7 లక్షల 70 వేల రూపాయలకు ఆ నెంబర్ ప్లేట్ ని దక్కించుకున్నాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
ఖైతారాబాద్ పరిధి లో ఉన్న ఈ RTO ఆఫీస్ లో జరిగిన వేలం పాట ద్వారా రవాణా శాఖకు ఆ ఒక్క రోజులోనే వేలం పాట ద్వారా 37 లక్షల రూపాయిలు వచ్చాయి. ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది లో కూడా వేలంపాట ని నిర్వహించి భారీ లాభాలను ఆర్జించింది రవాణా శాఖ. సినీ సెలబ్రిటీలతో కేవలం బాలకృష్ణ మాత్రమే కాదు, ప్రతీ హీరో కూడా తమ కార్ నెంబర్స్ ఫ్యాన్సీ గా ఉండేలా చూసుకుంటారు. ఎన్టీఆర్ కి 9999 అనే నెంబర్ ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్ లలో కూడా ఆయన ఈ నెంబర్ ని ప్రొఫైల్ నేమ్ లో పెట్టుకుంటాడు. ఆయన కారు నెంబర్ కూడా ఇదే. దీని విలువ కూడా లక్షల్లోనే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు ఈ లిస్ట్ లోకి వస్తారు.
ఇకపోతే నందమూరి బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను తో ‘అఖండ 2’ చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాని దసరా కి విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు కానీ, అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. వరుస విజయాలతో అభిమానులకు ఎన్నో మరపురాని జ్ఞాపకాలను అందిస్తున్న బాలయ్య, ఈ సినిమా తో ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ షేక్ చేసే పనిలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా సీక్వెల్స్ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేయడం వంటివి మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా కూడా అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.