
హిట్ సీరీస్ లతో సూపర్ పాపులర్ అయ్యాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఆయన డైరెక్ట్ చేసిన హిట్ ఫస్ట్ కేస్ సక్సెస్ అవ్వగా ఇదే తరహా కథలను హిట్ ఫ్రాంచైజీలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు శైలేష్. హిట్ 1 విశ్వక్ సేన్ చేయగా హిట్ 2 అడివి శేష్ చేశాడు. ఐతే హిట్ 1 నుంచి హిట్ 3 వరకు ఈ సినిమాలను నిర్మిస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. నాని నిర్మాతగా హిట్ సీరీస్ లు ఒక సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీలుగా మారాయి. ఈమధ్యనే వచ్చిన హిట్ 3 కూడా సూపర్ హిట్ కొట్టడంతో హిట్ సీరీస్ లకు మరింత క్రేజ్ ఏర్పడింది.
హిట్ 3 చివర్లో హిట్ 4 హీరో ఎవరన్నది రివీల్ చేశారు. ఈసారి హిట్ కేసుని తమిళనాడుకి షిఫ్ట్ చేస్తున్నాడు. హిట్ ఫ్రాంచైజీలో మిగతా భాషల హీరోలను కూడా తీసుకొచ్చి ఇదొక పెద్ద క్రేజీ సీరీస్ లుగా చేస్తున్నాడు శైలేష్ కొలను. ఐతే శైలేష్ హిట్ సినిమాలే చేస్తాడా వేరే సినిమాలు చేయడా అన్న కామెంట్స్ వినపడగా హిట్ 2 తర్వాత విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేశాడు. ఐతే ఆ సినిమా అసలేమాత్రం ఆడియన్స్ కు రీచ్ కాలేకపోయింది.
సైంధవ్ ఇచ్చిన షాక్ తో మళ్లీ హిట్ సీరీస్ ఛాన్స్ అయినా వస్తుందా రాదా అనుకున్న శైలేష్ కు నాని ఫోన్ చేసి వచ్చి హిట్ 3 చేసుకో అని ఆఫర్ ఇచ్చాడు. ఐతే నాని ఏదైతే శైలేష్ మీద నమ్మకం పెట్టుకున్నాడో దాన్ని వమ్ము చేయకుండా హిట్ 3 సక్సెస్ చేశాడు. అఫ్కోర్స్ అందులో నాని కాంట్రిబ్యూషన్ కూడా చాలానే ఉంది.
ఇదిలా ఉంటే హిట్ 3 తర్వాత హిట్ 4 కి కాస్త టైం ఉంది కాబట్టి శైలేష్ కొలను మళ్లీ హిట్ 4కి ముందు మరో బయట సినిమా చేయాలని చూస్తున్నాడట. ఐతే ఆల్రెడీ సైంధవ్ తో షాక్ తిన్న శైలేష్ మళ్లీ అలాంటి ప్రయత్నం చేస్తాడా అన్న డౌట్ రాక మానదు. శైలేష్ మాత్రం సైంధవ్ మిస్ ఫైర్ అయినా మరో మంచి కథతో రావాలని చూస్తున్నాడు. మరి హిట్ సీరీస్ ల నుంచి డైరెక్ట్ బయటకు వచ్చి సినిమా చేస్తాడా లేదా అన్నది చూడాలి.