
సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథను అమీర్ ఖాన్ వెండి తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఫాల్కే పాత్రలో అమీర్ ఖాన్ నటిస్తుండగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్ తో పాటు ఇదే బయోపిక్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాము ఎలాంటి బయోపిక్ చేయలేదని రాజమౌళి తనయుడు కార్తికేయ క్లారిటీ ఇవ్వడంతో? ప్రాజెక్ట్ అమీర్ చేతుల్లోనే ఉందని ఫైనల్ అయింది.
అమీర్ కూడా చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చా రు. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరింత సమాచారం బయటకు వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు అమీర్ తెలిపారు. `ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది. ఈ ప్రాజెక్ట్ నాకు-రాజుకి సవాలుతో కూడుకున్నది. భారీ సెట్ లు ..భారీ యాక్షన్ సన్నివేశాలున్న చిత్ర కాదు ఇది. ఎవ్వరూ ఊహించలేని కథ ఇది. ఫాల్కే ఆయన జీవితంలో ఓ సాహసికుడు.
ఆయన ఎంతో కమిట్ మెంట్.. డెడికేషన్ తో జీవితంలో సక్సెస్ అయ్యారు. ఏ పని చేసినా ఎంతో ఉత్సా హంగా చేసేవారు. వందశాతం నమ్మకంతో చేయడం ఆయనకు చిన్నప్పుడే అలవాటైంది. ఆయన ప్రతీ దశ ఎంతో సాహసంతో కూడుకున్నదే. అదే ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్లింది. అంత గొప్ప సక్సెస్ ఆయన కూడా ఊహించి ఉండరు. ఇది చాలా స్ఫూర్తిదాయకమైన సినిమా అవుతుంది.
దాదాసాహెబ్ ఫాల్కేపై బయోపిక్ తీయడం నాకు -రాజుకు గొప్ప గౌరవం` అని అన్నారు. హిరానీ ట్రేడ్మార్క్ హాస్య శైలిని కలిగి ఉంటుందా? అని ప్రశ్నించగా `హిరానీ మునుపటి చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా చాలా హాస్యంతో కూడిన డ్రామా ఉంటుందని అమీర్ బధులిచ్చారు. ఇటీవలే అమీర్ ఖాన్ నటించిన `సితారే జమీన్ పర్` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు మంచి టాక్ వచ్చినా ఆదరణ మాత్రం అంతంత మాత్రమే.