బుల్లితెర నటి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ పరిచయం అవసరం లేదు. ఈ భామ నిరంతర ఫోటోషూట్లు యువతరంలో వేడెక్కిస్తున్నాయి. పాలక్ ప్రస్తుతం ఆదిపురుష్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తో డేటింగ్ చేస్తోందంటూ ప్రచారం సాగుతోంది. పాలక్- ఇబ్రహీం జంట ఔటింగులు జంట షికార్లకు సంబంధించిన పోటోలు వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే, పాలక్ తివారీ ప్రస్తుతం తన మామ్ శ్వేతా తివారీతో కలిసి విహారయాత్రను ఆస్వాధిస్తోంది. ఈ విహార యాత్రలో తల్లీకూతుళ్ల బికినీ లుక్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అందమైన మామ్- డాటర్ జోడీ బికినీలలో ఫోటోలను షేర్ చేసిన తర్వాత నెటిజనులు పిచ్చెక్కిపోతున్నారు. ఈ ఫోటోలలో శ్వేతా తివారీ బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్ బికినీలో కనిపించగా, పాలక్ తివారీ రెడ్ అండ్ వైట్ బికినీలో కనిపించారు. ప్రస్తుతం ఇవి వైరల్ గా షేర్ అవుతున్నాయి.
అందాల మామ్ అండ్ డాటర్ బోల్డ్ లుక్స్ అభిమానులను ఆశ్చర్యపరిచాయి. నెటిజనులు వీటిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలను షేర్ చేసిన పాలక్ తన పోస్ట్‌లోని వ్యాఖ్యల విభాగాన్ని నిలిపివేసింది. కాబట్టి యూత్ ప్రస్తుతం పాలక్ తల్లి శ్వేతా తివారీ వ్యాఖ్యల విభాగంలో మామ్ అందచందాలపై వ్యాఖ్యానిస్తున్నారు.
సల్మాన్ `కిసీ కా భాయ్ కిసీ కి జాన్` చిత్రంతో తెరంగేట్రం చేసిన పాలక్ తివారీ కెరీర్ పరంగా ఆశించిన దూకుడును చూపించలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత పాలక్ నటించిన హారర్ కామెడీ `ది భూత్నీ` విడుదలైంది. తదుపరి స్టార్ కిడ్స్ సరసన నటించేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వరస చిత్రాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న పాలక్ టాలీవుడ్ అగ్ర నిర్మాతలకు ఫీలర్స్ వదులుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.




