
Snake Repellent: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఇలా చేస్తే.. పాములు దరిదాపుల్లోకి రావు!
Snake Repellent Remedies: వర్షాకాలం రాగానే పాముల భయం ఎక్కువవుతుంది. ఎండలు, చలి కాలం కన్నా ఈ సీజన్లో పాములు తేమ ఉన్న ప్రదేశాల కోసం ఎక్కువగా ఇళ్లలోకి, తోటల్లోకి వస్తుంటాయి. ఇక ఈ కాలంలో పాము కాటుకు గురయ్యే ఘటనలు కూడా పెరుగుతాయి. అయితే మన పూర్వికులు ఈ సమస్యను ఎదుర్కొనడానికి కొన్ని అద్భుతమైన ఇంటి చిట్కాలు పాటించేవారు. ఇప్పుడు అలాంటి పవర్ఫుల్ హోమ్ రెమెడీలను మీకు పరిచయం చేస్తున్నాం.
వెల్లుల్లి, ఉల్లిపాయ వాసన పాములకు అస్సలు నచ్చదు. అందుకే ఈ రెండు పదార్థాలతో మిశ్రమం తయారు చేసి, వర్షాకాలంలో వారం రోజులకు ఒకసారి ఇంటి చుట్టూ పిచ్చిగారి చేస్తే, పాములు దరిదాపుల్లోకి రావు. ఈ వాసన కారణంగా అవి అక్కడ నుంచి పారిపోతాయి.
ఇంటి చుట్టూ వేప, తులసి చెట్లు నాటి పెట్టడం వల్ల పాములతో పాటు ఇతర క్రిమి కీటకాల బెడద కూడా తగ్గుతుంది. అంతేకాకుండా వీటి ఆకులతో మిశ్రమం తయారు చేసి ఇంటి చుట్టూ చల్లితే, పాములు దగ్గర పడవు. వారానికి ఒకసారి ఇలా చేస్తే చాలు.
వానాకాలంలో ఇంటి చుట్టూ పొదలు, చెట్టాచెదారాలను వెంటనే తొలగించాలి. వీటిలోనే పాములు దాక్కుంటూ ఉంటాయి. దోమలు, ఇతర క్రిములు కూడా ఇక్కడే పెరుగుతాయి. కాబట్టి ఇంటి పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.
పాములు పొగ వాసనను భరించలేవు. అందుకే చెక్క సామాగ్రితో పొగ పెట్టడం మంచిది. ముఖ్యంగా రాత్రిపూట ఇలా చేస్తే మంచిది.
ఎర్ర మిరపకాయ పొడి, ఆవ నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని ఇంటి చుట్టూ పిచ్చిగారి చేయాలి. 15-20 రోజుల పాటు ఇలా చేస్తే పాములే కాదు, ఇతర క్రిమి కీటకాలు కూడా దరిదాపుల్లోకి రావు.
కొబ్బరి చిప్పలను కాల్చి వచ్చిన బూడిదను ఇంటి చుట్టూ చల్లితే పాములు దరిదాపుల్లోకి రావు. ఎందుకంటే ఇందులో ఉండే పీచు పాముల చర్మానికి హానికరంగా ఉంటుంది.
వర్షాకాలంలో ఈ సింపుల్ ఇంటి చిట్కాలను పాటిస్తే, పాముల బెడద నుంచి సులభంగా విముక్తి పొందవచ్చు. ఇవి సహజసిద్ధమైనవి కావడంతో ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు. మీ ఇంటి దగ్గరా ఇలా ప్రయత్నించి చూడండి!