
Beauty Tips: వర్షాకాలంలో స్కిన్ గ్లో కోసం ఈ చిట్కాలు ట్రై చేయండి
Beauty Tips: వర్షాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉండవచ్చు కానీ ఈ సీజన్లో మీరు మీ చర్మం పట్ల అదనపు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ సీజన్లో చాలా మంది చర్మం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల మొటిమలు, బ్లాక్‌హెడ్స్, దురద, చికాకు వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి. దీనికి కారణం ఈ సీజన్లో ఎక్కువ తేమ ఉండటం. దీని వల్ల జిగటగా అనిపిస్తుంది. చర్మం జిడ్డుగా మారుతుంది. కాబట్టి, వర్షాకాలంలో మన చర్మాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫేస్ వాష్ సరిగ్గా వాడండి
వర్షాకాలంలో మీ చర్మం ఎక్కువ జిడ్డుగా అనిపిస్తే, మీ ముఖాన్ని రోజుకు రెండుసార్లు తేలికపాటి ఫేస్ వాష్ తో కడుక్కోండి. తద్వారా చర్మంపై ఉన్న అదనపు జిడ్డు, మురికి తొలగిపోతుంది.
తేలికైన మాయిశ్చరైజర్
జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్‌ను ఎంచుకునేటప్పుడు అది తేలికైనదిగా ఉండాలని గుర్తుంచుకోవాలి. తద్వారా అది మీ చర్మానికి సరిపోతుంది. చర్మానికి ఎలాంటి హాని కలగదు.
సన్‌స్క్రీన్‌ను తప్పకుండా వాడండి
మీరు సన్‌స్క్రీన్‌ను వేసవి కాలంలోనే కాకుండా వర్షాకాలంలో కూడా ఉపయోగించాలి. ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. అలానే మీరు ఇంట్లో ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించండి.
ముఖాన్ని పదే పదే తాకవద్దు
మీకు మీ ముఖాన్ని పదే పదే తాకే అలవాటు ఉంటే ఆ అలవాటు మానుకోండి. ఎందుకంటే మీరు మురికి చేతులతో మీ ముఖాన్ని పదే పదే తాకితే చర్మ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల చర్మం దెబ్బతింటుంది.
తక్కువ కారంగా ఉండే ఆహారం తినండి
మీరు వేయించిన, కారంగా ఉండే ఆహారాన్ని వర్షాకాలంలో వీలైనంత తినకుండా ఉండండి. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా మీ చర్మానికి కూడా హానికరం. కాబట్టి, మీ చర్మాన్ని మెరిసేలా చేయడానికి మీ ఆహారంలో వీలైనన్ని ఎక్కువ పండ్లు, ఆరోగ్యకరమైన పానీయాలను చేర్చుకోండి.