
Honeymoon Murder Twist: ఒకే నెంబర్‌కు 234 సార్లు ఫోన్ చేసిన సోనమ్.. ఇంతకీ ఆ ఫోన్ నెంబర్ ఎవరిది? హనీమూన్ కేసులో మరో ట్విస్ట్
Honeymoon Murder Twist: హనీమూన్ హత్య కేసులో ఇప్పటివరకు అన్నీ మలుపులు, ట్విస్టులే. విచారణ జరుపుతున్న పోలీసులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా సోనమ్ ఒకే వ్యక్తికి 234 సార్లు ఫోన్ చేసిందని, ఆ ఫోన్లో ఉన్న వ్యక్తితో 30 నుంచి 60 నిమిషాల వరకు ప్రతిరోజూ మాట్లాడేదని పోలీసులు తమ విచారణలో తేల్చారు. అయితే ఇంతకీ సోనమ్ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? వివరాలు చూద్దాం.
రాజా రఘువంశీ, సోనమ్‌లు మే నెలలో పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా నెలరోజులకు హనీమూన్‌కి వెళ్లినప్పుడు, అక్కడ సోనమ్ మరికొంతమందితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ కేసులో నలుగుర్ని అరెస్ట్ చేశారు. అయితే ఈకేసులో విచారణ చేస్తున్న పోలీసులకు రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. తాజాగా సోనమ్ పెళ్లికి ముందు 39 రోజుల వ్యవధిలో ఏకంగా 234 సార్లు ఒకే వ్యక్తికి కాల్ చేసినట్లు తేలింది. అంతేకాదు ప్రతిరోజూ ఆ వ్యక్తితో సోనమ్ 30 నుంచి 60 నిమిషాల వరకు మాట్లాడటం ఫోన్ రికార్డ్ లో తెలుస్తుంది. అయితే పెళ్లి కుదిరినప్పటి నుంచే భర్తను చంపే ప్లాన్ చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఇంతకీ సోనమ్ అదే పనిగా ఫోన్ చేసి మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు? అని అంటే ఫోన్ రికార్డుల్లో ఆ వ్యక్తి పేరు సంజయ్ వర్మ అని ఉంది. ఇంతకీ ఈ కొత్త వ్యక్తి సంజయ్ వర్మ ఎవరా? అని పోలీసులు ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే.. సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహనే అని తెలిసింది. అయితే ఎవరికీ అనుమానం రాకుండా తన ప్రియుడి పేరును సంజయ్ వర్మగా ఫోన్లో ఫీడ్ చేసినట్లు స్పష్టమైంది.