
Arjun Son Of Vyjayanthi Collection: కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి'(Arjun S/O Vyjayanthi) ఇటీవలే గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ, యూత్ ఆడియన్స్ ఈ సినిమా పై కనీస స్థాయిలో కూడా తమ ఆసక్తిని చూపించడం లేదు. ఒక సినిమాకు ఓపెనింగ్స్ రావాలంటే కచ్చితంగా యూత్ ఆడియన్సు సపోర్ట్ తప్పనిసరి. వాళ్ళ ప్రోత్సాహం లేకుండా ఓపెనింగ్స్ రావడం అసాధ్యం. ఓపెనింగ్స్ భారీగా ఉండకపోతే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం. కానీ కొన్ని సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్స్ గా నిలుస్తుంటాయి. వీటిని మ్యాజిక్స్ అని అంటుంటారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ ఇలాంటి మ్యాజిక్స్ అన్ని సార్లు జరగవు. మరి ‘అర్జున్ S/O వైజయంతి’ విషయం లో జరుగుతుందో లేదో రేపటి నుండి తెలుస్తుంది.
అయితే విడుదలై రెండు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టింది?, భవిష్యత్తులో ఎంత వసూళ్లను రాబడితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అనేది చూడాలి. మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 2 కోట్ల 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజున కోటి 43 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొత్తం మీద రెండు రోజులకు కలిపి 4 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు తో పోల్చి చూస్తే 50 శాతం కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. మొదటి రోజు రెండు కోట్ల 20 లక్షల రూపాయిలు రాగా, రెండవ రోజు కేవలం కోటి 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు జరిగింది. వీకెండ్ కి కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాకపోయినా, కనీసం 8 కోట్లు అయినా వస్తుందని అనుకున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ వీకెండ్ పూర్తి అయ్యే సమయానికి కేవలం 5 కోట్ల రూపాయిల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఈ చిత్రం. ఓవర్సీస్ లో అయితే నెగటివ్ షేర్స్ వస్తున్నాయి. రేపటి నుండి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించకపోతే, కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ చిత్రం గా నిలుస్తుంది. నిన్న కళ్యాణ్ రామ్ సక్సెస్ మీట్ లో వచ్చే మంగళవారం లోపు బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పిన మాటలకు, అక్కడ వస్తున్న వసూళ్లకు అసలు సంబంధమే లేకపోవడం గమనార్హం.