
Hyderabad: మీరు తక్కవ ధరలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? హైదరాబాద్లో ఇల్లు కావాలంటే ఇలా అప్లై చేయండిHyderabad Housing Board Houses Sanction: సొంతింటి కల సాకారం కాక ఇంకా చాలామంది ఎదురుచూస్తుంటారు. అలాంటివారికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తీసుకొచ్చింది. రాజీవ్ స్వగృహ పథకం కింద గతంలో నిర్మించిన అమ్ముడుపోని అపార్ట్ మెంట్లు, ఇండ్లను ఇప్పుడు వేలం ద్వారా అమ్మాలని చూస్తుంది. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర నగరాల్లో ఉన్న ప్లాట్లు, ఇండ్లను అమ్మితే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాజీవ్ స్వగృహ పథకం కింద గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అపార్ట్ మెంట్లు, ఇండ్లు నిర్మించి తక్కువ ఖర్చుకు విక్రయించారు. ఈ విధంగా చేయడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇళ్లను అమర్చుకోగలిగారు. అయితే ఆ సమయంలో కట్టివాటిలో చాలా ప్లాట్లు, చాలా ఇండ్లు ఇంకా ఇప్పటికీ కాళీగా ఉన్నాయి. అయితే వీటిని వేలం పాట ద్వారా వెంటనే విక్రయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్లాట్లను, ఇండ్లను వెంటనే అమ్మడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చూడాలని అధికారులను ఆయన సూచించారు. ఈ ప్రక్రియను రాష్ట్ర హౌసింగ్ బోర్డు శాఖ, రాజీవ్ స్వగృహ సంస్థ సంయుక్తంగా ప్రారంభించాయి.
ఇప్పటికే కూకట్ పల్లి వంటి ప్రాంతాల్లో వేలం వేయగా ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గజం ధర అక్కడ సుమారు రు. 3 లక్షలకు చేరడం విశేషం. మిగిలినవి కూడా ఇలానే అమ్ముడుపోతే ప్రభుత్వానికి భారీస్థాయిలో లాభం చేకూరే అవకాశం ఉంది. అదేవిధంగా మిగిలినవాటికోసం వేలంపాట నోటిఫికేషన్ రానుంది. ఈ నెల 20 నుంచి వేలం పాట జరగనుంది. ఈ వేలం ప్రక్రియ, ధరలు, దరఖాస్తు విధానం తదితర వివరాలు అన్నీ త్వరలో తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్లో పొందుపరచనుంది. కాబట్టి దాన్ని ఫాలో చేసి ఇళ్లను బుక్ చేసుకుంటే వేలం పాటలో తక్కువ ధరకే ఇళ్లు వచ్చే అవకాశం ఉంది.�