
ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మొదలైంది. ఇన్నాళ్ళూ పరోక్షంగా సాగిన ఈ యుద్ధం కాస్తా ఇపుడు ప్రత్యక్ష యుద్ధంగా మారింది. ఇజ్రాయిల్ అన్న దేశం ఈ భూభాగం మీద ఉండరాదు అన్న పంతంతో ఇరాన్ వ్యవహరిస్తోంది. ఆ టార్గెట్ లో భాగానే యుద్ధానికి సై అంటోంది. మరో వైపు చూస్తే ఇరాన్ తమకు వ్యతిరేకంగా అణ్వాయుధాలను తయారు చేస్తోంది అన్నది ఇర్జాయిల్ ఆరోపణ.
ఆ అణ్వాయుధాలు కనుక ఉగ్రవాదుల చేతులకు చిక్కితే మాత్రం అది కచ్చితంగా ప్రమాదం తమకే అని భావిస్తూ ముందస్తు చర్యలలో భాగంగానే ఇజ్రాయిల్ ఇరాన్ కోని అణు తయారీ స్థావరాల మీద దాడులు చేసింది. అలాగే ఆరుగురు అణు శాస్త్రవేత్తలను ఇరాన్ కీలక నేతలను మట్టుబెట్టింది. అంతే కాదు ఇరాన్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది.
తమకు ఇరాన్ తో యుద్ధం అంటే దేశాన్ని కాపాడుకోవడమే అని ఇజ్రాయిల్ అంటోంది. నిజానికి ఇజ్రాయిల్ వాదన కూడా కరెక్టే. చుట్టూ ముస్లిం దేశాలు మధ్యలో ఉన్న అతి చిన్న దేశం ఇజ్రాయిల్ అన్నది అందరికీ తెలిసిందే. ఇంతకాలం ఇజ్రాయిల్ చుట్టూ ఉన్న దేశాలలో ఉగ్ర మూకలకు మద్దతు ఇస్తూ ఇజ్రాయిల్ మీదకు ఉసిగొలుపుతూ ఇరాన్ ఆ దేశాన్ని దెబ్బ తీస్తోంది అన్నది ఇజ్రాయిల్ బలమైన ఆరోపణ. అందుకే ఈసారి ఇజ్రాయిల్ తోనే తాము తేల్చుకోవాలని చూస్తోంది.
అందుకే రెండు దేశాలు తమ ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధమైపోయాయి. ఈ నేపధ్యంలో అమెరికా, ఫ్రాన్స్ యూకే వంటి దేశాలు ఇజ్రాయిల్ కి ఏ విధంగా మద్దతు ఇచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ అపుడే హెచ్చరికలను జారీ చేసింది అయితే ఎంత ఇరాన్ బయటకు చెప్పినా హెచ్చరించినా ఇర్జాయిల్ వెనక ఉన్నది అమెరికా అన్నాది అందరికీ తెలిసిందే అన్న ప్రచారం ఉంది.
ఇంకో వైపు చూస్తే కనుక ఇరాన్ కి ఎవరు సాయం చేస్తారు అంటే రష్యా చైనా అని అంటున్నారు. అయితే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ తో యుద్ధంతో పూర్తిగా ఇబ్బందులో ఉంది. చైనా తీరు చూస్తే ఎపుడూ తెర వెనక నుంచి సాయమే కానీ తెర ముందుకు వచ్చింది ఉండదు. దాంతో ఇరాన్ కి ఎంత మేరకు ఇతర దేశాల సాయం దొరుకుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇరాన్ కి మద్దతుగా ముస్లిం దేశాలు అన్నీ ఏకం కావాలని పాకిస్థాన్ ఇప్పటికే పిలుపు ఇస్తోంది.
ఇంకో వైపు గల్ఫ్ దేశాల నుంచి ఇరాన్ కి ఏ మేరకు మద్దతు ఉంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. అలా రెండు వైపుల నుంచి మోహరింపు కనుక ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటే కనుక అది నెమ్మదిగా ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు అని అంటున్నారు. అయితే అంతదాకా పరిస్థితి రాదు అని అంటున్నారు. ఇంకో వైపు ఈ రెండు దేశాలలో విజయం ఎవరిది అన్న చర్చ కూడా ఉంది.
ఇరాన్ తమ దేశంలో అంతర్గత సమస్యలతో సతమతం అవుతోంది అని అంటున్నారు. అలాగే గల్ఫ్ దేశాల మధ్య ఆధిపత్య పోరు కూడా ఇరాన్ కి శాపంగా మారవచ్చు అని అంటున్నారు. దాంతో ఇరాన్ కే ఈ యుద్ధం వల్ల నష్టం ఉండొచ్చు అన్నది ఉంది. ఇజ్రాయిల్ తనకు ఉన్న ఇంటెలిజెన్స్ సంపత్తితో ఇప్పటికే ఇరాన్ లోని కీలక ప్రాంతాలను అన్నింటినీ టార్గెట్ చేసింది అని అంటున్నారు. దాంతో ఏ మేరకు ఇరాన్ కి దెబ్బ పడుతుంది అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయిల్ కి ఏమైనా ముప్పు ఉందా అన్న కోణంలో కూడా చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.