
పడవలో మంటలు చెలరేగి దాదాపు 145 మంది మృతి చెందిన.. విషాదకర ఘటన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డిఆర్సి)లో జరిగింది. మంగళవారం ఈక్వేటర్ ప్రావిన్స్ రాజధాని ఎంబండకా సమీపంలో విస్తారమైన కాంగో నదిపై ప్రయాణించడానికి వందలాది ప్రయాణీకులు చెక్క పడవలో ఎక్కారు. అయితే ఆ పడవలో ఇంధనం వల్ల మంటలు చెలరేగాయి. వెంటనే పడవ బోల్తాపడింది. దీంతో అందులోని ప్రయాణీకులు నదిలో పడి మృతి చెందారు. ఈ ప్రమాదంలో 143 మంది చనిపోగా… పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదంలో మొదటగా 131 మందిని రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. గురువారం, శుక్రవారాల్లో మరో 12 మృతదేహాలను వెలికితీశారు. మరికొంతమంది ఆ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. మొత్తంగా ఈ ప్రమాదంలో 145 మంది చనిపోయారని, మరికొంతమంది దగ్ధమైపోయారని, మరికొంతమంది నీటిలో గల్లంతయ్యారని రెస్క్యూ అధికారి జోసెఫిన్ లోకుము తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.