తెలంగాణ: రేవంత్‌కు పాదాభివందనం చేసిన ఐఏఎస్ అధికారికి చీవాట్లు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాదాభివందనం చేసిన ఐఏఎస్ అధికారి శరత్‌పై చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ సభలో ఐఏఎస్ అధికారి శరత్ ముఖ్యమంత్రి రేవంత్‌కు పాదాభివందనం చేయడం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు కాళ్లు మొక్కిన ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు.
ఆదేశాలు జారీ
తాజాగా ఐఏఎస్ అధికారి శరత్ చేసిన చర్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు నిబంధనలను ఉల్లంఘించిన ఐఏఎస్ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిబంధనలను ఉల్లంఘించి పాదాభివందనాలు చేస్తున్నారని, తమ స్థాయికి తగినట్లుగా వ్యవహరించాలని, లేకపోతే ప్రజల్లో విశ్వాసం కోల్పోతామని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
