
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి అమలు
గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ బియ్యం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. MDU వాహనాల కొనుగోలు కోసం గత ప్రభుత్వం 1860 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిందని ఆయన తెలిపారు. ఇంటింటికీ రేషన్ బియ్యం డెలివరీ జరగలేదని, ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
రేషన్ బియ్యం పంపిణీ
సుమారు 30 శాతం మందికి రేషన్ బియ్యం అందలేదని IVRS ద్వారా తమకు సమాచారం అందినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారానే ప్రజలు రేషన్ బియ్యం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, 65 ఏళ్లు దాటిన వృద్ధులు మరియు వికలాంగులకు మాత్రం రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.