
నేడు కదిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చైర్మన్‌ను సభ్యులు ఎన్నుకోనున్నారు. ఇప్పటికే కదిరి ఛైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు కూటమి పార్టీలు ఈ పదవిని సొంతం చేసుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేశారు.
కూటమి ఖాతాలోనే…
తెలుగుదేశం పార్టీ తమ పార్టీలో చేరిన ఇరవై మంది కౌన్సిలర్లను బెంగళూరు క్యాంప్ నకు తరలించారు. బెంగళూరు క్యాంప్ నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకురానున్నారు. టీడీపీకి ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఉండగా, వైసీపీకి కేవలం పదకొండు మంది సభ్యులే ఉండటంతో ఈ పదవి కూటమి పరం కావడం ఖాయం. అయితే ఈ సమావేశానికి 11 మంది వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది.