
తెలంగాణలో సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సరస్వతి పుష్కరాలు ప్రారంభమై నేడు ఐదో రోజుకు చేరుకోవడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి త్రివేణి సంగమంలో స్నానమాచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే పుష్కరాలు కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లను నియమించింది. పురుషులకు, మహిళలకు ప్రత్యేక ఘాట్లను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల చర్యలు తీసుకుంది.