
రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమాలను థియేటర్లలో బంద్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను తమ థియేటర్లలో ఆడించలేమని, పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమా థియేటర్లలో మూవీలను విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు.
పర్సంటేజీ ప్రాతిపదికన…
అద్దె ప్రాతిపదికన సినిమాలకు నగదు చెల్లింపులు జరపుతుంటే తమకు థియేటర్ల నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో నిర్మాతలు దీనిపై నిర్ణయం తీసుకుని పర్సంటేజీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి తెలగు ఫిలిం ఛాంబర్ లో దిల్ రాజుతో పాటు దగ్గుబాటి సురేష్ తో పాటు అరవై మంది ఏపీ, తెలంగాణకు చెందిన ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్లను బంద్ చేయాలని రెండు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.