
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రకటించారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించారు. ఉచితంగా మహిళలు బస్సులో ప్రయాణించేందుకు వీలుగా సంచలనమైన ప్రకటన చేశారు.
కర్నూలులో చెప్పిన చంద్రబాబు
ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించడం పట్ల మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తెలంగాణ, కర్ణాటక తరహా మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని జిల్లాలకే పరిమితం చేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసనమండలిలో ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాని కోరుతున్నారు.