
మీకు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో మీరు టి డి ఖాతా ఓపెన్ చేయాలి. మీరు ఈ టి డి ఖాతాలకు ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు కాలపరిమితిని ఎంపిక చేసుకోవచ్చు. ఒక సంవత్సరం టిడి పోస్ట్ ఆఫీస్ తన వినియోగదారులకు 6.9% వడ్డీ రేటును అలాగే రెండు సంవత్సరాల టిడి కస్టమర్లకు 7.0%, మూడు సంవత్సరాల టిడి కస్టమర్లకు 7.1% ఇక ఐదు సంవత్సరాల టిడి పై కస్టమర్లకు 7.5% వడ్డీ రేటును అందిస్తుంది. ఉదాహరణకు మీరు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న టి డి లో ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు మెచ్యూరిటీ సమయానికి రూ.7,24,974 అందుతాయి. మీరు పెట్టుబడి పెట్టిన 5 లక్షల తో పాటు మీకు వడ్డీ రూ.2,24,974 అదనంగా వస్తాయి.
కస్టమర్లు ఈ పథకంలో హామీతో చాలా స్థిర వడ్డీ రేటును పొందే అవకాశం ఉంది. అయితే ఈ పథకంలో సాధారణ పౌరుడికి అలాగే సీనియర్ సిటిజనులకు ఒకే రకమైన వడ్డీ రేటు ఉంటుంది. కనీసంగా ఇందులో మీరు 1000 రూపాయలు డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. ఈ పథకంలో మీరు జమ చేసిన డబ్బు సురక్షితంగా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పథకాలకు ప్రభుత్వ భరోసా ఉంటుంది కాబట్టి ఇందులో మీరు పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితం. ప్రభుత్వం మీరు ఈ పథకాలలో జమ చేసిన ప్రతి డబ్బుకు కూడా భద్రత కల్పిస్తుంది. ఈమధ్య కాలంలో పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పొదుపు పథకాల గురించి ప్రజలలో అవగాహన కూడా బాగా పెరిగిందని తెలుస్తుంది.