
ఆ తర్వాత లబ్ధిదారులందరికి ఇళ్ల నిర్మాణం కోసం గృహ నిర్మాణ సంస్థ సహాయం కూడా అందేలా చూస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇళ్ల పథకం అమలు చేస్తున్నప్పటికీ చాలామందికి ఇంకా దీని గురించి తెలియకపోవడంతో ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో అధికారులు ప్రజలకు అవగాహన కలిగేలా చేస్తున్నారు. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులైన పేద ప్రజలు ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఆ పూర్తి వివరాలను వాళ్ళు వీఆర్వో లాగిన్ కి పంపుతారు. ఆ తర్వాత ఈ పత్రాలను రెవెన్యూ అధికారులు పరిశీలించి అర్హులైన వారికి స్థలం మంజూరు చేయడానికి పై అధికారులకు సిఫార్సు చేస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద వీళ్ళందరికీ ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం అందజేస్తుంది.
ఇంటి నిర్మాణం కోసం పట్టణాలలో ఉన్న లబ్ధిదారులకు రూ.2.50 లక్షలు అందజేస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎంత ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. గత ప్రభుత్వం హయాంలో ఉన్న సమయంలో పేద ప్రజలకు కేటాయించిన స్థలాలలో ఇప్పటివరకు కూడా ఎవరు ఇల్లు కట్టుకోవడం షురూ చేయలేదు. ఇటువంటి వారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అండగా నిలుస్తుంది. గతంలో మధ్యలో ఆగిపోయిన ఇళ్లను కేటగిరి వారిగా విభజించే వారికి 50 వేల రూపాయల నుంచి లక్ష వరకు అదనంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అర్హత ఉండి ఇప్పటివరకు సొంత ఇల్లు లేని పేద ప్రజలు వెంటనే ఈ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు.