
ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ (Karthi)చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఆయన స్టోరీస్ సెలక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలను చేస్తూ వచ్చినప్పటికి వెంకటేష్ – కార్తీలు మాత్రం చాలా సెలెక్టెడ్ సబ్జెక్టులను ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ ఇద్దరినీ కలిపి సినిమాలో పెట్టి ఒక సినిమా చేయాలని కొంతమంది సినిమా మేకర్స్ అయితే ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్లిద్దరినీ కలిపి సినిమా చేయగలిగే కెపాసిటీ ఏ దర్శకుడికి ఉంది అనే ధోరణిలో కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. అయితే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న గౌతమ్ మీనన్ (Goutham Menon) వీళ్ళిద్దరితో ఒక భారీ సినిమాను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. వెంకటేష్ తో ఘర్షణ అనే సినిమా చేశాడు.
ఆ సినిమా మంచి క్రేజ్ ను అయితే సంపాదించుకుంది. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతుందా? ఇందులో ఇద్దరు హీరోలుగా కనిపించబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 400 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది.