
కలబంద జెల్
కలబందను సహజ చికిత్సగా పిలుస్తారు. ఇది చర్మానికి చల్లదనాన్ని, ఓదార్పునిచ్చే లక్షణాలను కలిగి ఉంది. కలబందలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఎండలో మొహం, చర్మం కాలిపోయినా కూడా కలబంద జెల్ చాలా ప్రభావవంతంగా పని చేసి వాటిని నయం చేస్తుంది.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో తేలికపాటి సహజ SPF ఉంటుంది. ఇది చర్మాన్ని తేలికపాటి సూర్యకాంతి నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా ఉంచుతుంది. ఎండలో బయటకు వెళ్ళే ముందు కొబ్బరి నూనెను చర్మానికి రాసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
నువ్వుల నూనె
నువ్వుల నూనె చాలా శక్తివంతమైన సహజ సన్‌స్క్రీన్. ఇది UV కిరణాల నుంచి 30% వరకు రక్షణను అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ చర్మాన్ని పోషిస్తాయి. బాహ్య నష్టాల నుంచి రక్షిస్తాయి.
క్యారెట్లు – టమోటాలు
క్యారెట్లు, టమోటాలలో లభించే బీటా కెరోటిన్, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. వాటిని తీసుకోవడం వల్ల చర్మాన్ని కాపాడుతుంది. సూర్యకాంతి వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.
గంధపు పొడి
గంధపు పొడిని వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించడానికి, చర్మాన్ని చల్లబరుస్తుంది. దీన్ని చర్మానికి పూయడం వల్ల UV కిరణాల ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుంది. చర్మం మృదువుగా కూడా మారుతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు UV కిరణాల వల్ల కలిగే వాపు, నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని చర్మంపై పూయడం వల్ల వడదెబ్బ సమస్య తగ్గుతుంది. చర్మం రక్షణ స్థాయి పెరుగుతుంది.
ఇవి కూడా ఉపయోగపడతాయి.
UV కిరణాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సులభమైన మార్గం తేలికైన, వదులుగా ఉండే దుస్తులు ధరించడం. అలాగే టోపీలు, సన్ గ్లాసెస్ ఉపయోగించండి. ఇది చర్మాన్ని ప్రత్యక్ష సూర్యకాంతి నుంచి రక్షిస్తుంది. తద్వారా వడదెబ్బ, ఇతర చర్మ సమస్యలను నివారిస్తుంది.