కళ్ళకు ఉండే అద్దాలలో లెన్స్ చాలా కీలకమైనవి. చుట్టూ ప్రేమ్ ఎలా ఉన్నా లెన్స్ క్లియర్ గా ఉంటేనే కళ్ళు బాగా కనిపిస్తాయి. లేకుంటే మానసికంగా తీవ్రవేదనను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఒక్కోసారి కళ్లద్దాలను అశుభ్రమైన ప్రదేశాల్లో ఉంచడం వల్ల లేదా అనుకోకుండా లెన్స్ పగిలిపోతూ ఉంటాయి. వీటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్న అవి పాడైపోతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే లెన్స్ మార్చుకోవడానికి కనీసం రూ. 500 నుంచి రూ.1000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఇప్పుడు ఓ సంస్థ ఉచితంగానే లెన్స్ మార్చే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆయా నగరాల్లో ఉండే Lenskart అనే ఆప్టికల్ షాప్ లోకి వెళ్లి లెన్స్ ను మార్చుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఆయా పట్టణాలు లేదా నగరాల్లో ఉండే షాపుల్లో వీటిని వెంటనే వెళ్లి మార్చుకోవాలని కొందరు చెబుతున్నారు. అయితే షాపులోని లెన్స్ ను ఉచితంగానే ఇస్తారు. కానీ దీని ఫిట్టింగ్ చార్జి మాత్రం రూ.200 తీసుకుంటారు.. సాధారణ షాపుల్లో లెన్స్ చార్జి తో పాటు వీటిని కూడా అదనంగా వేస్తారు. అందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని లెన్స్ కార్డు ప్రతినిధులు తెలుపుతున్నారు.
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు కళ్ళజోడు తప్పనిసరిగా మారింది. కంట్లో ఉన్న సమస్యలతో పాటు మెడ నొప్పులు వంటివి ఉన్నా కూడా.. కళ్ళజోడు అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అయితే కళ్ళజోడులోని లెన్స్ ను మార్చుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే నిర్లక్ష్యంగా ఉండడంవల్ల మానసికంగా ఆందోళనగా ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటేనే కళ్ళు బాగా కనిపిస్తాయి.
