
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే వ్యాస్ ఒక ఇంటర్నేనేషనల్ స్కూల్ లో పర్సనాలిటీ డెవలప్ మెంట్ టీచర్ గా పని చేస్తుంటాడు. ఆయన దృష్టిలో చదువు అంటే బట్టి కొట్టడం కాదు…ఒక సబ్జెక్ట్ ను అర్థం చేసుకొని పిల్లలు చదివితే వాళ్ళకు జ్ఞానం వస్తుంది అని భావించే వ్యక్తి…అతని భార్య అదే స్కూల్ లో ప్రిన్సిపల్ గా చేస్తుంది…ఇక వాళ్ళ అబ్బాయి అదే స్కూల్ లో స్టూడెంట్ గా ఉంటాడు…మరి మొత్తానికి వ్యాస్ చెప్పినట్టుగా చదువును పిల్లలకి తను అనుకున్న విధంగా అందించాడా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా బావుంది. నిజానికి ఇంతకుముందు కూడా ఇలాంటి పాయింట్స్ తో కొన్ని సినిమాలు వచ్చినప్పటికి దర్శకుడు ఈ సినిమా కోసం రాసుకున్న ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. ఫస్టాఫ్ ఒకే అనిపించినప్పటికి, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం ప్రేక్షకుడి చేత విజిల్స్ వేయిస్తాయి. అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్స్ అయితే ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…దర్శకుడు ఏ పాయింట్ ను అయితే చెప్పాలి అనుకున్నాడో దాన్ని సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు.
ఎక్కడా కూడా డివియెట్ అవ్వకుండా తను అనుకున్న పాయింట్ ను రీచ్ అవ్వడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాడు… థియేటర్ కి అయితే ఈ సినిమా అంత బాగా వర్కౌట్ అవ్వదనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని ఓటిటి లోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ కోర్ ఎమోషన్ మాత్రం సినిమాలో చూసిన ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేయడమే కాకుండా తర్వాత కూడా ప్రేక్షకుడికి అది గుర్తుండిపోతుంది…మొత్తానికైతే ఈ సినిమాతో దర్శకుడు మంచి సక్సెస్ ను సాధించాడనే చెప్పాలి…
అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లు మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ఉంటాయి. దానివల్ల సీన్స్ కొంచెం రొటీన్ గా ఉన్నాయనే ఫీల్ అయితే కలుగుతుంది. అలాగే కరెక్ట్ గా కొలత వేసినట్టుగా ఒక రెండు రిలీఫ్ సీన్స్ వచ్చిన తర్వాత మరొకటి ఎమోషనల్ సీన్స్ ని అలాగే కంటతడి పెట్టించేసి ఉంచితే ఆడ్ చేస్తూ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఏదో కావాలని ఎమోషన్ ని బిల్డ్ చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో సుమంత్ చాలా ఎక్స్ట్రాడినరీగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ ను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇండస్ట్రీ లో ఇంత మంచి నటుడు ఉన్నాడనే విషయాన్ని చాలామంది దర్శకులు మర్చిపోయారు. కానీ ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవడమే కాకుండా ఒక గొప్ప సినిమాలో అతను ఒక గొప్ప క్యారెక్టర్ ని పోషించాడనే విషయమైతే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. సుమంత్ వైఫ్ క్యారెక్టర్ చేసిన నటి కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించింది.
ఇక చిన్నపిల్లాడు కూడా బాగా నటించి మెప్పించాడు. అలాగే ఆ అబ్బాయి చేసిన యాక్టింగ్, అతను చెప్పే డైలాగులు, ఎక్స్ప్రెషన్స్ కూడా సినిమాకి చాలా బాగా కలిసి వచ్చాయి… ఇక మిగతా ఆర్టిస్టులందరు కూడా వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు…
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించిందనే చెప్పాలి. కోర్ ఎమోషన్ ను పండించడం లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అద్భుతంగా కుదిరింది. ఇక ఈ సినిమాలో ఉన్న ఒకటి రెండు పాటలు కూడా సిచువేషన్ కు తగ్గట్టుగా చాలా బాగా సెట్ అయ్యాయి… సినిమాటోగ్రఫీ కూడా చాలా వరకు చాలా చక్కగా కుదిరింది. అనవసరమైన షాట్స్ లేకుండా చాలా పద్ధతిగా విజువల్స్ ని అందిస్తూ చాలా వరకు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేశారు…
ప్లస్ పాయింట్స్
సుమంత్ యాక్టింగ్
సెంటిమెంటల్ సీన్స్
సెకండాఫ్
మైనస్ పాయింట్స్
కొన్ని రొటీన్ సీన్స్
ఫస్టాఫ్…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5