ధోని వివాహం జరిగిన తర్వాత..
ధోని వివాహం జరిగిన తర్వాత ఒకసారిగా లక్ష్మీరాయ్ సైలెంట్ అయిపోయింది. ఇక అప్పటినుంచి ధోని ఆడుతున్న మ్యాచ్లకు హాజరు కావడం మానేసింది. ధోని పెళ్లి చేసుకోవడంతో లక్ష్మీరాయ్ సింగిల్గానే మిగిలిపోయింది. ఆ తర్వాత సినిమాలలో బిజీ అయిపోయింది. ఇప్పటికీ ఆ విషయం గురించి లక్ష్మీ రాయ్ ఎదుట ప్రస్తావిస్తే..” దాదాపు 14 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది. ఇప్పటికి జనం దానిని గుర్తుకు పెట్టుకున్నారా? నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాస్తవానికి ధోని గురించి నన్ను పదేపదే అడిగేవారు. ఇలాంటి సమాధానం చెప్పాలో అర్థం అయ్యేది కాదు. ఒకరకంగా నా కెరియర్లో అది మాయని మచ్చలాగా మిగిలిపోయింది. ఇప్పుడైతే ధోని తన కుటుంబంతో ఉన్నాడు. కానీ ఇలాంటి వాటివల్ల సంసార జీవితంలో విభేదాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఇబ్బందికర వాతావరణాన్ని ఎదురు చూడాల్సి ఉంటుంది. విమర్శ చేయడం.. పుకార్లు పుట్టించడం క్షణకాలమైన పని. కానీ దానివల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో పడిన వారికి మాత్రమే తెలుస్తుంది. రేపు ఇదే విషయం గురించి నా పిల్లలు నన్ను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి.. అందువల్లే ఇలాంటి విషయాలలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుందని” లక్ష్మీరాయ్ వ్యాఖ్యానించింది. లక్ష్మీ రాయ్ మాటల్లో ధోనితో ఉన్న రిలేషన్ నిజమే అని తెలిసిపోయింది. కాకపోతే అది అప్పట్లోనే కట్ అయిపోయిందని.. ఇప్పుడు ఎవరి బతుకు వారు బతుకుతున్నారని లక్ష్మీ రాయ్ మాటల్లో స్పష్టమైంది.
