
పాక్ హైకమిషన్ ఉద్యోగి రెహమాన్‌పై భారత్ వేటు వేసింది. గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అనుమానంతో రెహమాన్ ను భారత్ లో ఉండ కూడదని చెప్పింది. రాయబార కార్యాలయంలో ఉండే అర్హతలేని వ్యక్తిగా భారత్ ప్రకటించింది. ఇరవై నాలుగు గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశం పాక్ రాయబార కార్యాలయంలో ఉద్యోగిని ఆదేశించింది.
ఐఎస్ఐకు సమాచారం…
పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం రెహమాన్ పని చేస్తున్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో గూఢచర్యం నిర్వహిస్తున్నారని నిర్ధారించింది. భారత సైన్యం సమాచారాన్ని ఐఎస్ఐ కి చేరవేస్తున్న రెహమాన్ డానిష్ మారుపేరుతో ఐఎస్ఐ కోసం పనిచేస్తూ ఇక్కడి ముఖ్యమైన విషయాలను అందిస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు.