
ఆంధ్రప్రదేశ్ లో నేడు కేంద్ర బృందం పర్యటించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర బృందం సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ లో నౌకల మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై చర్చించేందుకు నేడు కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానుంది.
నౌకల మరమ్మతుల కేంద్రాన్ని…
నౌకల మరమ్మతుల కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ లోని దుగ్గిరాజ పట్నంలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన భూ సేకరణతో పాటు వివిధ అంశాలపై చంద్రబాబు నాయుడుతో కేంద్ర బృందం చర్చించనున్నట్లు తెలిసింది. దుగ్గరాజపట్నంలో నౌకల మరమ్మతుల కేంద్రం ఏర్పాటయితే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.