
సూపర్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో రజినీకాంత్ (Rajinikanth)…70 సంవత్సరాల వయసులో కూడా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తన అభిమానులను సైతం అతని సినిమాలతో ఆకట్టుకుంటూ యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోతున్న విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. రజనీకాంత్ అనగానే ప్రతి ఒక్కరికి భాషా, ముత్తు, నరసింహ, శివాజీ, రోబో లాంటి సినిమాలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసిన సినిమాలు తెలుగులో డబ్ అవ్వడం వల్ల అతనికి తెలుగులో కూడా వీరాభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలిపితే ఇకమీదట సాధించబోయే విజయాలు ఆయన గౌరవాన్ని పెంచే విధంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఒకప్పుడు ఆయన పాన్ ఇండియాలో పెను ప్రభంజనాలను సృష్టించాడు. రోబో సినిమాతో 400 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాడు. రోబో 2 సినిమాతో 600 కోట్ల కు పైన కలెక్షన్స్ ను వసూల్ చేసి తనకంటూ ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సీనియర్ హీరోలందరిలో తను ముందు వరుసలో ఉన్నాడు. ఇక జైలర్ (Jailer) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు జైలర్ 2 (Jailer 2) సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.
ఇక జైలర్ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివన్న అలాగే మలయాళం స్టార్ హీరో అయిన మోహన్ లాల్ ఇద్దరు కూడా క్యామియో రోల్స్ పోషించారు. ఇక జైలర్ 2 విషయానికి వచ్చేసరికి వాళ్ళిద్దరితో పాటు తెలుగులో బాలయ్య బాబు కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మూవీలో బాలయ్య ఒక సైకో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట.
బాలయ్య నార్మల్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటేనే డిఫరెంట్ మాడ్యులేషన్స్ తో డైలాగులను చెబుతూ అదరగొడుతూ ఉంటాడు. మరి సైకో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే ఇక రచ్చ రచ్చ అంటూ చాలామంది బాలయ్య బాబు అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…